
నాటు నాటు పాట ఆస్కార్ వేదిక మీద పాడే అవకాశం రావడానికి కారణం రాజమౌళి , కీరవాణి అలాగే మాకుటుంబ సభ్యులకు ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు సింగర్ కాలభైరవ. ఇంకేముంది ఎన్టీఆర్ , చరణ్ అభిమానులకు విపరీతమైన కోపం వచ్చింది అంతే కాలభైరవ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్టీఆర్, చరణ్ అభిమానులతో పాటుగా నెటిజన్లు కూడా విమర్శల దాడి మరీ ఎక్కువ చేయడంతో చేసేదిలేక పాపం కాలభైరవ అభిమానులకు సారీ చెప్పాడు.
నాకు చరణ్ , తారక్ అన్న ఇద్దరూ అంటే ఎనలేని గౌరవం …… మా నాటు నాటు పాట ఇంతగా పాపులర్ అయ్యిందంటే కారణం అందుకు వాళ్లిద్దరే అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే నేను నా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వాళ్ళ సహకారం , ప్రోత్సాహం వల్లే ఆస్కార్ వేదిక మీద ఈ పాట పాడగలిగే అవకాశం లభించిందని అందుకే వాళ్లకు థాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సి వచ్చిందని వివరం ఇచ్చాడు. దాంతో శాంతించారు నెటిజన్లు.
ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు అనే పాటను కాలభైరవ , రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఈ పాట ఎంతగా పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇక ఆస్కార్ కూడా సాధించడంతో యావత్ ప్రపంచం నాటు నాటు అంటూ ఊగిపోతోంది. ఎక్కడ చూసినా నాటు నాటు అనే పాట సంచలనం సృష్టిస్తోంది. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి కాలభైరవ ఆస్కార్ వేదిక మీద పాడిన విషయం తెలిసిందే. ఆ పాట అలా అయిపోవడమే ఆలస్యం ఆస్కార్ వేదిక ముందు కూర్చున్న ఆహూతులంగా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. దాంతో ఆనందంతో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. కాలభైరవ సంగీత దర్శకుడు కీరవాణి పెద్ద కొడుకు అనే విషయం తెలిసిందే.