నాడు ఎన్టీఆర్ ని తిట్టిన బండి సంజయ్ నేడు ఎన్టీఆర్ కు వంగి వంగి దండం పెడుతున్న బండి సంజయ్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మార్చారు ఎన్టీఆర్ అభిమానులు అలాగే నెటిజన్లు. ఎన్టీఆర్ ని బండి సంజయ్ తిట్టడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటించిన సంగతి తెలిసిందే.
అయితే అప్పట్లో ఎన్టీఆర్ ముస్లిం గెటప్ లో ఉన్న స్టిల్ రిలీజ్ చేసారు. ఆ స్టిల్ చూసి ఎన్టీఆర్ అభిమానులు ఖంగుతిన్నారు. అంతేకాదు కొమురం భీమ్ ఎవరి పైన అయితే యుద్ధం చేసాడో వాళ్ళ మనిషిగా ఎలా కనిపిస్తాడు సినిమాలో …….. చరిత్రని వక్రీకరిస్తారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు పలువురు. ఇక బండి సంజయ్ అయితే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.
ఎన్టీఆర్ ని అలాగే దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళిని కూడా తీవ్ర స్థాయిలో తిట్టాడు. అంతేకాదు అసలు ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎలా విడుదల అవుతుందో చూస్తాం అంటూ హెచ్చరికలు కూడా జారీ చేసాడు. కట్ చేస్తే ఇటీవల కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా రావడంతో ఎన్టీఆర్ ని డిన్నర్ కు ఆహ్వానించారు. ఆ సమయంలో బండి సంజయ్ ఎన్టీఆర్ కు వంగి వంగి దండాలు పెట్టాడు. దాంతో అప్పటి మాటలను ఇప్పటి ఫోటోలను పెడుతూ ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు.
Breaking News