
జూనియర్ ఎన్టీఆర్ కు షాక్ ఇచ్చాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్టీఆర్ కు కేసీఆర్ షాక్ ఇవ్వడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఈరోజు బాలీవుడ్ చిత్రం ” బ్రహ్మాస్త్ర ” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ ఎత్తున అభిమానుల సమక్షంలో చేయాలనుకున్నారు. అనుమతులు కూడా తీసుకున్నారు. అయితే అనూహ్యంగా ఈరోజు బ్రహ్మాస్త్ర ఈవెంట్ కు అనుమతి నిరాకరించారు తెలంగాణ పోలీసులు.
బ్రహస్త్ర ఈవెంట్ కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరు అవుతుండటమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా ను కలిశారు. దాంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మారుతుండటంతో కేసీఆర్ ప్రభుత్వం ఆగ్రహంగా ఉందట.
దాంతో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు అవుతున్న వేడుకకు తొలుత అనుమతి ఇచ్చి ఇప్పుడేమో భారీ ఎత్తున అభిమానులు వస్తే…… ప్రధాన రోడ్లన్నీ బ్లాక్ అవుతాయని దాంతో ఇబ్బందులు వస్తాయని అందుకే అనుమతి ఇవ్వడం లేదని , పైగా గణేష్ ఉత్సవాల భద్రతలో నగర పోలీసులు నిమగ్నమయ్యారని అందుకే అనుమతి ఇవ్వలేకపోతున్నామంటూ వివరణ ఇచ్చారు పోలీసులు. అయితే అసలు కారణం వేరే ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
రామోజీ ఫిలిం సిటీ లో బ్రహ్మాస్త్ర ఈవెంట్ కు అనుమతి నిరాకరించడంతో పార్క్ హయత్ హోటల్ లో కేవలం కొద్దిమంది సమక్షంలో ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటుగా రణబీర్ కపూర్ , ఎస్ ఎస్ రాజమౌళి , నాగార్జున తదితరులు పాల్గొననున్నారు.