యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు సారీ చెప్పాడు. నిన్న అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున బ్రహ్మాస్త్ర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉండే. రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున వేడుకలకు రంగం సిద్ధం చేసారు కూడా. అయితే చివరి నిమిషంలో ఈ వేడుకకు అనుమతి నిరాకరించారు తెలంగాణ పోలీసులు.
అందుకు కారణం ఏం చెప్పారంటే ……. భారీ ఎత్తున అభిమానులు వస్తారు కాబట్టి వాళ్ళను కంట్రోల్ చేయలేమని , పైగా పోలీసులు అందరూ గణేష్ ఉత్సవాల భద్రతలో నిమగ్నమయ్యారని చెప్పారు. దాంతో రామోజీ ఫిలిం సిటీ లో జరగాల్సిన బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దాంతో తన అభిమానులకు సారీ చెప్పాడు ఎన్టీఆర్.
రామోజీ ఫిలిం సిటీలో ఈవెంట్ రద్దు కావడంతో హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో కేవలం ప్రెస్ మీట్ కు మాత్రమే అనుమతి ఇచ్చారు పోలీసులు. దాంతో పార్క్ హయత్ హోటల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. హిందీ చిత్రమైన బ్రహ్మాస్త్ర తెలుగులో కూడా విడుదల అవుతోంది. ఈ చిత్రంలో నాగార్జున కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వడం విశేషం. అలాగే మరో విశేషం ఏంటంటే ……. దక్షిణాదిన విడుదల అవుతున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ రాజమౌళి సమర్పకులుగా వ్యవహరించడం.
Breaking News