అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఉండటంతో ఎన్టీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈరోజు ఉదయం ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ , లక్ష్మీ ప్రణతి ,బాలయ్య కూతురు బ్రాహ్మణి , భార్య వసుంధర తదితరులు బెంగుళూరు చేరుకున్నారు. నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకొని ICU లో ఉన్న తారకరత్న ను చూసి కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఎన్టీఆర్ తో తారకరత్న కు పెద్దగా బాండింగ్ లేకపోయినప్పటికీ హరికృష్ణ మరణం సమయంలో నందమూరి కుటుంబం అంతా కలిసిపోయింది. ఇక అప్పటి నుండి తారకరత్నతో ఎన్టీఆర్ కు అనుబంధం ఏర్పడింది.
ఇక ముందు నుండి కూడా నందమూరి కళ్యాణ్ రామ్ కు అలాగే నందమూరి కుటుంబ సభ్యులతో తారకరత్నకు మంచి అనుబంధం ఉంది. దాంతో తారకరత్న ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు అని తెలుసుకొని బాధపడ్డారు. అతడ్ని చూడటానికి నందమూరి కుటుంబం మొత్తం బెంగుళూరుకు చేరుకుంది. ఇక తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని , అతడ్ని స్వయంగా చూసి భోరున విలపిస్తున్నారు. ఎన్టీఆర్ కూడా కన్నీళ్ల పర్యంతమయ్యారు. గెట్ వెల్ సూన్ తారకరత్న అంటూ నినదిస్తున్నారు నందమూరి అభిమానులు. కర్ణాటక సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ తో పాటుగా కర్ణాటక వైద్య శాఖా మంత్రి కూడా నారాయణ హృదయాలయ ఆసుపత్రికి వచ్చి నందమూరి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు.