
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. కుటుంబ సమేతంగా అమెరికా వెళ్లిన ఎన్టీఆర్ కు అక్కడి తెలుగు వాళ్ళు బ్రహ్మరథం పడుతున్నారు. అమెరికాలోని విశేషమైన వంటకాలను రుచి చూపిస్తున్నారు. అయితే మసాలాలు , కారం ఎక్కువగా తినే ఎన్టీఆర్ కు అమెరికా వంటకాలు బాగున్నాయని అనిపించినప్పటికీ , నాలుక కాస్త చెప్పబడిందట. దాంతో ఇండియన్ స్పైసీ ఫుడ్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో తనకిష్టమైన వంటకాలను అందించే రెస్టారెంట్ కనిపించింది. ఇంకేముంది ఆ రెస్టారెంట్ లో ఫుల్లుగా లాగించేసాడు. సదరు రెస్టారెంట్ వాళ్ళతో కలిసి ఫోటోలకు ఫోజిచ్చాడు.
ఎన్టీఆర్ మంచి భోజన ప్రియుడు అనే విషయం తెలిసిందే. తాత నందమూరి తారకరామారావు, నాన్న హరికృష్ణ, బాబాయ్ బాలకృష్ణ లు సైతం మంచి భోజన ప్రియులు దాంతో అదే వంట బట్టింది జూనియర్ ఎన్టీఆర్ కు. ఇక భార్యా పిల్లలతో కలిసి అమెరికా వెళ్లిన ఎన్టీఆర్ న్యూ ఇయర్ వేడుకలు అక్కడే జరుపుకోనున్నాడు. కొత్త ఏడాది సంక్రాంతి ముందు తిరిగి హైదరాబాద్ రానున్నాడు. వచ్చాక కొరటాల శివ సినిమాపై దృష్టి పెట్టనున్నాడు. ఈ సినిమా మార్చిలో ప్రారంభం కావచ్చని తెలుస్తోంది.