ఆర్ ఆర్ ఆర్ టీమ్ పై ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రాంచరణ్ ను బాగా చూపించి ఎన్టీఆర్ తక్కువ చేసి చూపించారని సినిమా విడుదలైన సమయంలో ఆగ్రహించిన ఫ్యాన్స్ ఆ తర్వాత ఎన్టీఆర్ సూచనల మేరకు కావచ్చు లేదంటే అలిసిపోయి కావచ్చు ఆ తర్వాత పెద్దగా విమర్శలు చేయలేదు.
కానీ తాజాగా మరోసారి ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల రాంచరణ్ కు పలు గౌరవాలు దక్కడంతో ప్రపంచ వ్యాప్తంగా చరణ్ పేరు మారుమ్రోగుతోంది. పలు మీడియా సంస్థలుకూడా చరణ్ కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. దానికి తోడు పలువురు సినీ ప్రముఖులు కూడా చరణ్ పేరునే ప్రస్తావిస్తున్నారు. ఈ తతంగమంతా ఎన్టీఆర్ అభిమానులను తీవ్రంగా కలిచి వేసింది.
అంతే ……. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ఏకమై విమర్శల వర్షం కురిపించారు. దాంతో ఆర్ ఆర్ ఆర్ టీమ్ దిగొచ్చింది. అలాగే హాలీవుడ్ సంస్థ కూడా ఏకంగా ప్రకటన జారీ చేసింది. ఎన్టీఆర్ ను కూడా ఆహ్వానించామని , అయితే కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నానని ఎన్టీఆర్ పేర్కొన్నారని దానికి తోడు ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి తారకరత్న చనిపోవడంతో ఆ కర్మకాండలను పూర్తి చేసేంత వరకు అక్కడే ఉండాల్సి వస్తుందని చెప్పాడని ప్రకటించడం విశేషం. ఈ ప్రకటనతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపం తగ్గడం ఖాయం.
ఇటీవల నందమూరి తారకరత్న మరణించిన సంగతి తెలిసిందే. మార్చి 2 న తారకరత్న పెద్ద కర్మ నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమం అయ్యాక అమెరికా బయలుదేరనున్నాడు ఎన్టీఆర్. మార్చి 12 న ఆస్కార్ అవార్డుల వేడుక జరుగనుంది. ఆ అవార్డుల వేడుక అయ్యాక మళ్ళీ ఇండియాకు తిరిగి రానున్నాడు ఎన్టీఆర్.