
నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా నిర్వహిస్తున్న బ్లాక్ బస్టర్ షో ” అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే ” . ఆహా కోసం చేస్తున్న ఈ షో ట్రెండ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ షోలో ఇప్పటి వరకు పలువురు హీరోలు , దర్శక నిర్మాతలు , హీరోయిన్ లు పాల్గొన్నారు కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం పాల్గొనలేదు. దాంతో బాబాయ్ – అబ్బాయ్ కలిసి షోలో కనిపిస్తే చూడాలని ఆశ పడుతున్నారు నందమూరి అభిమానులు.
అయితే ఎన్టీఆర్ ఈ షోకు రావడానికి ఇష్టపడుతున్నాడట కానీ బాలయ్య ఇంకా సుముఖత వ్యక్తం చేయలేదని అందుకే ఎన్టీఆర్ ఈ షోలో కనిపించడం లేదని వినిపిస్తోంది. ఈ మాట ఎంతవరకు నిజం అన్నది పక్కన పెడితే ……….. నందమూరి అభిమానులు ముఖ్యంగా ఎన్టీఆర్ ను బాగా అభిమానించే వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ షోలో ఎన్టీఆర్ పాల్గొనాలని కోరుతున్నారు. ఇదే విషయాన్ని అటు బాలయ్యను ఇటు ఆహా టీమ్ ను అడుగుతున్నారు ……. ప్రశ్నిస్తున్నారు.
బాలయ్యకు ఎన్టీఆర్ కు మధ్య కొంత దూరం అయితే ఉందన్నది వాస్తవం. ఆ దూరం తగ్గితే మంచిదేనని భావిస్తున్నారు నందమూరి అభిమానులు. కానీ వాళ్ళ కోరిక ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. దాంతో కొంత నిరాశలో ఉన్నారు. ఇక బాలయ్య షోలో ఇప్పటికే ప్రభాస్ రాగా త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు కూడా అడుగు పెట్టబోతున్నారు. దాంతో ఆ ఎపిసోడ్స్ కూడా రచ్చ రంబోలా అవ్వడం ఖాయం.