ఎన్టీఆర్ తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఎన్టీఆర్ కొత్త సినిమా అప్ డేట్ గురించి దాదాపు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. అయితే గత ఏడాది ఆర్ ఆర్ ఆర్ విడుదలై భారీ విజయం సాధించడంతో ఇక ఏడాది కాలంగా అయితే తదుపరి సినిమా గురించి మాత్రం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అదిగో …… ఇదిగో అంటూ కాలయాపన జరుగుతోంది కానీ సినిమా మాత్రం పట్టాలెక్కడం లేదు దాంతో కొరటాల సినిమా అప్ డేట్ ఇవ్వాలని పదేపదే అడుగుతూనే ఉన్నారు.
నిన్న రాత్రి హైదరాబాద్ లో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ అనే చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు హాజరయ్యారు. ఇక అమిగోస్ ఫంక్షన్ లో ఎన్టీఆర్ – కొరటాల మూవీ అప్ డేట్ కావాలని పదేపదే కోరారు. అభిమానుల ఒత్తిడి ఎక్కవ కావడంతో ఎట్టకేలకు ఎన్టీఆర్ స్పందించాడు.
అయితే ప్రస్తుతం అయితే ఎలాంటి అప్ డేట్ లేదని , ఎందుకంటే మన తెలుగు సినిమా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. అంటే ఇక నుండి మనం చేసే ప్రతీ సినిమా ఆస్థాయిలోనే ఉండాలి. అందుకే కాస్త ఆలస్యం అవుతోంది. కొరటాల శివ ప్రస్తుతం అదేపనిలో ఉన్నాడు. కాబట్టి కొత్త అప్ డేట్ ఉంటే ముందుగా మా ఇంట్లో వాళ్లకు చెప్పకముందే మీకు చెబుతామని , అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే అని అభిమానులను కోరాడు. అభిమానులు సంతృప్తి చెందారు కానీ తప్పకుండా అప్ డేట్ ఉంటుందని ఊహించి షాకయ్యారు.