
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలగించి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెల్త్ యూనివర్సిటీగా మార్చడం పట్ల అన్న నందమూరి తారకరామారావు కుటుంబం తీవ్రంగా ఖండించింది. హెల్త్ యూనివర్సిటీని 1986 లో స్థాపించింది ఎన్టీఆర్. అలాగే ఎన్టీఆర్ అంటే కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతం కాదు …….. యావత్ తెలుగుజాతికి ప్రతీక. అలాంటి గొప్ప వ్యక్తి పేరును తొలగించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసారు.
అయితే అన్న నందమూరి తారకరామారావు కుటుంబం తరుపున నందమూరి రామకృష్ణ ఓ లేఖ విడుదల చేసారు. ఆ లేఖలో తమ అభిప్రాయాలను అలాగే జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్చడంతో ఏపీలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ శ్రేణులు రోడ్ల మీదకొచ్చి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ సర్కారు మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది.