
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎన్టీఆర్ కోపంగా ఉన్నాడట. ఎన్టీఆర్ కు కేసీఆర్ మీద కోపం ఎందుకో తెలుసా …… బ్రహ్మాస్త్ర ఈవెంట్ కు పర్మిషన్ ఇచ్చి చివరి నిమిషంలో అనుమతి రద్దు చేసారు. దాంతో జక్కన్న కు దాదాపుగా 3 కోట్ల నష్టమట. ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీలో బ్రహ్మాస్త్ర ఈవెంట్ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసారు. ఆ ఏర్పాట్లకు మొత్తంగా 3 కోట్ల వరకు ఖర్చు అయ్యిందట.
అయితే తీరా ఈవెంట్ సమయానికి క్యాన్సిల్ అని చెప్పడం కేవలం అమిత్ షా తో తాను కలవడమే అని ఎన్టీఆర్ ఒక నిర్దారణకు వచ్చాడట. అంతేకాదు రాజమౌళి తండ్రి కథా రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ ని రాజ్యసభకు పంపించింది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఆయనేమో రజాకార్ ఫైల్స్ అనే స్క్రిప్ట్ రెడీ చేసాడు. దాంతో అటు ఎన్టీఆర్ మీద ఇటు రాజమౌళి ఫ్యామిలీ మీద కోపంగా ఉన్నారట కేసీఆర్.
అందుకే బ్రహస్త్ర ఈవెంట్ రద్దు అయ్యిందని తెలుస్తోంది. అంటే తనని కేసీఆర్ టార్గెట్ చేసాడని భావిస్తున్నాడట ఎన్టీఆర్. దాంతో నేను కూడా తగ్గేది లేదు అని అంటున్నాడట ఎన్టీఆర్. గతంలో కూడా ఎన్టీఆర్ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించాడు. తాత పెట్టిన పార్టీ తెలుగుదేశం కోసం ప్రచారం చేసాడు. అయితే ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యాడు. కట్ చేస్తే ఇన్నాళ్లకు మళ్ళీ రాజకీయాలపై దృష్టి సారించేలా ఉన్నాడు ఎన్టీఆర్. కేసీఆర్ పాలన మీద కూడా ఎన్టీఆర్ కు అసంతృప్తి ఉందట. దాంతో కేసీఆర్ – ఎన్టీఆర్ ల మధ్య వైరుధ్యం మొదలైందన్న మాట.






