యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. ఇంతకీ ఎన్టీఆర్ పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఏంటో తెలుసా ….. అవి ఎంత దుమారం రేపుతున్నాయో తెలుసా …….. త్వరలోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు అందుకోవడం ఖాయమని , నారా చంద్రబాబు నాయుడు కొత్త పార్టీ పెట్టుకొని పవన్ కళ్యాణ్ తో కలిసి పోటీ చేస్తాడని దాంతో ఏపీలో మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడని వ్యాఖ్యానించాడు.
ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఎన్టీఆర్ అమిత్ షా మీటింగ్ ఉద్దేశం ఇదేనని , కేవలం సినిమాల గురించి మాట్లాడటం కోసం అమిత్ షా ఎన్టీఆర్ ని కలవలేదని కూడా స్పష్టం చేసాడు. చంద్రబాబును తెలుగుదేశం పార్టీ నుండి బయటకు పంపించేసి ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపడతాడని కొడాలి నాని వ్యాఖ్యానించడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు చేతిలో ఉంది. దాన్ని ఎన్టీఆర్ లాగేసుకోవడం అంత సులభం కాదు. అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేసాడంటే నిజంగానే తెరవెనుక ఏదో పెద్ద మంత్రాంగమే నడుస్తోంది అనిపిస్తోంది. ఒకప్పుడు ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు కొడాలి నాని. కానీ తెలుగుదేశం పార్టీని వీడి చంద్రబాబును లోకేష్ ని దారుణంగా విమర్శిస్తున్నాడు నాని.
Breaking News