లైగర్ చిత్రంలో హీరోగా విజయ్ దేవరకొండ నటించాడు. అయితే ముందుగా ఈ సినిమాలో ఏ హీరోకు ఛాన్స్ వచ్చిందో తెలుసా …….. జూనియర్ ఎన్టీఆర్ . అవును జూనియర్ ఎన్టీఆర్ తో పూరీ జగన్నాథ్ ” టెంపర్ ” అనే చిత్రాన్ని చేసాడు 2015 లో. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాంతో మళ్ళీ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని చూసాడు. అందులో భాగంగానే లైగర్ కథ చెప్పాడట.
అయితే కథ విన్నాకా ఎన్టీఆర్ కు నచ్చలేదట. దాంతో నాకు ఈ కథ సెట్ అవ్వదు అని మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసాడట. మనం తప్పకుండా భవిష్యత్ లో సినిమా చేద్దాం కాకపోతే లైగర్ మాత్రం వద్దు అని చెప్పాడట. దాంతో పలువురు హీరోలను అనుకున్న పూరీ జగన్నాథ్ చివరకు విజయ్ దేవరకొండకు చెప్పడం వెంటనే అతడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.
కట్ చేస్తే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. నిన్న విడుదలైన ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ రావడంతో పాపం ఈ సినిమాని కొన్న బయ్యర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి భారీ హైప్ రావడంతో ఓపెనింగ్స్ మాత్రం బాగానే ఉండబోతున్నాయి. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఓ భారీ డిజాస్టర్ నుండి తప్పించుకున్నాడన్నమాట.
Breaking News