27.9 C
India
Thursday, September 10, 2026
More

    తండ్రి ఎన్టీఆర్ టైటిల్స్ తో హిట్స్ అందుకున్న బాలయ్య

    Date:

    NTR - NBK super hit movies
    NTR – NBK super hit movies

    నటరత్న నందమూరి తారకరామారావు నటించిన పలు సూపర్ హిట్ చిత్రాల టైటిల్స్ ను తన చిత్రాలకు పెట్టుకొని సూపర్ హిట్స్ అందుకున్నాడు నందమూరి బాలకృష్ణ. తండ్రి నటించిన సూపర్ హిట్ చిత్రాల టైటిల్స్ పెట్టుకోవడం అంటే ఒక సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే సినిమా ప్లాప్ అయితే తండ్రి పేరుని చెడగొట్టిన పేరు వస్తుంది …… విమర్శలు వచ్చి పడతాయి.

    అయితే ఆ విషయంలో నందమూరి బాలకృష్ణ తండ్రి పేరు నిలబెట్టాడు అనే చెప్పాలి. ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రం కథానాయకుడు. కాగా అదే టైటిల్ ను తన చిత్రానికి పెట్టుకొని సూపర్ డూపర్ హిట్ కొట్టాడు బాలయ్య. అలాగే భలే తమ్ముడు అనే చిత్రంతో ఎన్టీఆర్ సూపర్ హిట్ అందుకోగా అదే టైటిల్ తో సూపర్ హిట్ కొట్టాడు బాలయ్య.

    నిప్పులాంటి మనిషి అనే టైటిల్ తో ఎన్టీఆర్ సూపర్ హిట్ అందుకోగా అదే టైటిల్ తో సినిమా తీసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు బాలయ్య. ఇక ఎన్టీఆర్ నటించిన మరో కళాఖండం సీతారామ కళ్యాణం. ఇక బాలయ్య కూడా సీతారామ కళ్యాణం అనే టైటిల్ తో సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు.

    ఇక రాముడు భీముడు అనేది ఎన్టీఆర్ నటజీవితంలో అతిపెద్ద మలుపు అనే చెప్పాలి. ఆ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే అదే టైటిల్ తో బాలయ్య రాముడు – భీముడు అనే సినిమా చేసాడు. కానీ ఇది అంతగా ఆడలేదు.

    ఎన్టీఆర్ నటించిన మరో సూపర్ హిట్ చిత్రం రాము. అలాగే బాలయ్య కూడా రాము అనే టైటిల్ తో సినిమా చేసాడు. ఇది బాలయ్య కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచింది. ఎన్టీఆర్ నటించిన మరో సూపర్ హిట్ మూవీ దేశోద్ధారకులు. ఐతే కాస్త విభిన్నంగా దేశోద్ధారకుడు అనే సినిమా చేసాడు బాలయ్య. ఇది కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.

    జయసింహ అనే టైటిల్ తో ఎన్టీఆర్ చేసిన సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక జైసింహా అనే టైటిల్ తో బాలయ్య సినిమా చేసాడు. ఇది పెద్ద హిట్ కాదు కానీ హిట్ చిత్రంగా నిలిచింది. ఎన్టీఆర్ డ్రైవర్ రాముడు అనే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంటే బాలయ్య లారీ డ్రైవర్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక ఎన్టీఆర్ నటించిన అపురూప దృశ్య కావ్యం నర్తనశాల. ఇదే టైటిల్ తో బాలయ్య నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహిస్తూ సినిమా ప్రారంభించాడు కానీ అది ఆదిలోనే ఆగిపోయింది.

    బాలయ్య తన తండ్రి నటించిన పలు చిత్రాల టైటిల్స్ తో సినిమాలు చేసి సూపర్ డూపర్ హిట్ లు అందుకున్నాడు. అందులో రాముడు – భీముడు చిత్రం ఒకటే అంతగా ఆడలేదు. మిగతా సినిమాలు మాత్రం బాగా ఆడాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    Balayya : బాలయ్య బాబు, ఎన్టీఆర్ మధ్య మాటలు కలిపింది ఎవరో తెలుసా..?

    Balayya : తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్థాయిలో వరుసగా సక్సెస్‌ఫుల్...

    Balakrishna : పంచెకట్టులో పరిపూర్ణుడైన బాలయ్య: పద్మభూషణ్ అవార్డు వేడుకలో ‘అన్న’గారిని గుర్తుశాడిలా

    Balakrishna : తెలుగుతనం ఉట్టి పడేలా, తన వంశపారంపర్య గౌరవాన్ని చాటిస్తూ నటసింహం...

    Balakrishna : ఢిల్లీలో పద్మభూషణ్ అందుకోనున్న ‘నటసింహం’ నందమూరి బాలకృష్ణ

    Balakrishna : జనవరి 25, 2025న గణతంత్ర దినోత్సవానికి ముందు కేంద్రం...