యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. కాగా ఈ కాంబినేషన్ లో సినిమా అని ప్రకటించినప్పటి నుండి ఎప్పుడు ఈ సినిమా ప్రారంభం అవుతుందా ? అని ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు నందమూరి అభిమానులు. అయితే తాజాగా దర్శకులు ప్రశాంత్ నీల్ ఈ సినిమా ప్రారంభమయ్యేది ఎప్పుడు అనేది చెప్పాడు.
ఇంతకీ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా స్టార్ట్ అయ్యేది ఎప్పుడో తెలుసా …….. 2023 మేలో. అవును వచ్చే ఏడాది 2023 లో ఎన్టీఆర్ పుట్టినరోజు కంటే ముందుగానే అంటే మేలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20 న అనే సంగతి తెలిసిందే. అంటే ఎన్టీఆర్ పుట్టినరోజు కంటే ముందే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది కాబట్టి ఎన్టీఆర్ అభిమానులకు నిజమైన పండగే అని చెప్పాలి.
ప్రశాంత్ నీల్ …… ఈ పేరు భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రభంజనం. కేవలం కేజీఎఫ్ చాప్టర్ 1 , కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రాలతోనే తిరుగులేని విజయాలను అందుకోవడమే కాకుండా కొత్త చరిత్ర సృష్టించాడు. ఇక ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.
Breaking News