యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన పనికి షాక్ అవుతున్నారు నెటిజన్లు. ఇంతకీ ఎన్టీఆర్ చేసిన పని ఏంటో తెలుసా …….. వర్షం పడుతున్నా సరే పునీత్ రాజ్ కుమార్ మీద ఉన్న అభిమానంతో వర్షంలో తడుస్తూనే వేదిక మీద ఉన్నాడు. అంతేకాదు వర్షానికి కుర్చీలలో నీళ్లు పడ్డాయి. దాంతో పునీత్ రాజ్ కుమార్ భార్య , ఇన్ఫోసిస్ మాతృమూర్తి కూర్చునే సమయంలో వాళ్ళ కుర్చీలను ఎన్టీఆర్ స్వయంగా తుడవడం విశేషం. అలాగే ఆ తర్వాత తన కుర్చీని తుడుచుకొని కూర్చున్నాడు.
ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ స్టార్ హీరో అయినప్పటికీ తనకు పునీత్ రాజ్ కుమార్ పట్ల ఆ కుటుంబం పట్ల , మహిళల పట్ల తనకున్న గౌరవం ప్రదర్శించే అవకాశం లభించడంతో ఆ వీడియో చూస్తున్న ఎన్టీఆర్ అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. అలాగే మిగతా హీరోల అభిమానులు కూడా ఎన్టీఆర్ చేసిన పనికి ఫిదా అవుతున్నారు.
కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన కర్ణాటక రత్న అవార్డు ను పునీత్ రాజ్ కుమార్ కు ఇవ్వాలని నిర్ణయించి ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ , ఎన్టీఆర్ లతో పాటుగా శివ రాజ్ కుమార్ , పునీత్ రాజ్ కుమార్ ల కుటుంబాలను ఆహ్వానించింది. పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని ఈ అవార్డును అందుకున్నారు.