యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించడానికి పలువురు హీరోయిన్ లు పోటీ పడుతుంటారు కానీ సమంత మాత్రం తనకు ఆ ఛాన్స్ వస్తే మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసింది. ఇంతకీ ఆ కథ ఏంటో తెలుసా …….. విడాకుల తర్వాత సమంత వీరలెవల్లో రెచ్చిపోతూ సినిమాలు చేస్తోంది. అలాగే ఐటెం సాంగ్ కూడా చేసి పిచ్చెక్కించిన విషయం తెలిసిందే. ఊ అంటావా మావా అంటూ యావత్ భారతాన్ని ఒక ఊపు ఊపేసింది దాంతో తన రేంజ్ మొత్తం మారిపోయిందని భావిస్తోంది.
అందుకే ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమాలో హీరోయిన్ గా సమంతని అనుకొని సంప్రదించారట. అయితే ఈ భామ మాత్రం రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేసిందట. ఇంతకీ ఈ భామ ఎంత డిమాండ్ చేసిందో తెలుసా …… 4 కోట్లు. ఆ మాట విని కళ్యాణ్ రామ్ , కొరటాల శివ జడుసుకున్నారట. అయితే సమంత అయితే బెటర్ అని భావించి రెండున్నర కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారట.
అయితే సమంత మాత్రం మొహమాటం లేకుండా 4 కోట్లు ఇస్తే చేస్తా లేదంటే లేదు అని కరాఖండిగా చెప్పేసిందట. దాంతో సమంత బదులు మరో హీరోయిన్ ని తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. గతంలో సమంత ఎన్టీఆర్ కాంబినేషన్ లో పలు చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. బృందావనం , రభస , రామయ్యా వస్తావయ్యా , జనతా గ్యారేజ్ తదితర చిత్రాల్లో నటించారు. దాంతో ఏ సినిమాలో కూడా యాడ్ అయితే బాగుంటుందని అనుకున్నారు కానీ నా రేంజ్ మారిపోయింది అంటూ ఎన్టీఆర్ సినిమాని రిజెక్ట్ చేసింది.