
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతిని ప్రేమ పూర్వకంగా కౌగిలించుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఈ ఫోటో ఇక వైరల్ గా మారడం ఖాయం. 2011 లో ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు 12 ఏళ్ళు అవుతోంది ఈ ఇద్దరికీ పెళ్లి అయి. షూటింగ్ లో ఏమాత్రం గ్యాప్ దొరికినా చాలు తన భార్యా పిల్లలతో కలిసి విహార యాత్రకు వెళుతూనే ఉంటాడు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతికి ఇద్దరు కొడుకులు. దాంతో నలుగురు కలిసి వివిధ దేశాలకు వెళుతూనే ఉంటారు. తాజాగా అమెరికా పర్యటనలో ఉన్నారు ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి. దాదాపు నెల రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. న్యూ ఇయర్ వేడుకలు అమెరికాలోనే జరుపుకోనున్నారు. అయితే సంక్రాంతి నాటికి మాత్రం ఇండియాకు రానున్నారు. ఇక అమెరికాలో ఉన్న సమయంలో భార్యకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడట ఎన్టీఆర్.
ఎందుకంటే సినిమాల్లో నటించడం అంటే చాలా చాలా బిజీగా ఉంటారు. ఆ సమయంలో భార్యా పిల్లలతో కలిసి ఎక్కువ సమయం గడపలేరు. దాంతో సినిమాకు సినిమాకు మధ్య గ్యాప్ ఉన్నప్పుడే ఇలా ఫారిన్ టూర్ లకు వెళ్తుంటారు. ఇక అక్కడ తన భార్యను కౌగిలించుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేసి ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నాడు. ఎన్టీఆర్ అమెరికా నుండి వచ్చాక కొరటాల శివ సినిమా చేయనున్నాడు.
