యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ” విరూపాక్ష ” ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది. మెగా హీరో కు నందమూరి హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం ఏంటి ? అని ఆశ్చర్యపోతున్నారా ? అటు నందమూరి హీరోలు ఇటు మెగా హీరోలు పోటీ పడుతూనే ఒకరికోసం ఒకరు అన్నట్లుగా వ్యవహరిస్తూ మేమంతా ఒక్కటే ! సంకేతం ఇస్తున్నారు అభిమానులకు.
అందులో భాగంగానే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చాడు ఎన్టీఆర్. ఈ వాయిస్ ఓవర్ తో విరూపాక్ష చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచింది. దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. విరూపాక్ష చిత్రాన్ని 2023 ఏప్రిల్ 21 న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ , ఎస్వీ సీసీ సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషం. మరో విశేషం ఏంటంటే ……. ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండటం. ఎన్టీఆర్ – సుకుమార్ ల కాంబినేషన్ లో నాన్నకు ప్రేమతో వంటి సూపర్ హిట్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు.