
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమా లో ఏ రేంజ్ లో పోటాపోటీగా నటించి ఆకట్టుకున్నారో బిగ్ స్క్రీన్ పై ప్రపంచమంతా చూసింది. ఎవరు బాగా చేశారో కూడా చెప్పలేనంతగా ఇద్దరు తమ నటనతో సినీ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు. కానీ అటు రామ్ చరణ్ ఇటు తారక్ అభిమానులు మాత్రం తమ హీరో బాగా చేశాడంటే తమ హీరోనే బాగా చేశాడంటూ సోషల్ మీడియా వేదికలపై తెగ కొట్లాడుకుంటున్నారు . అయితే ఇప్పుడు వారికి అసలైన పోటీ మొదలు కాబోతోంది. ఏ హీరో సత్తా ఏమిటో ఒకేసారి తెలియబోతోంది. అదెలా అంటారా.. ఈ ఇద్దరు హీరోలు నటిస్తున్న ప్రెస్టేజియస్ మూవీలు ఒకేసారి బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాయి. దీంతో ఎవరు బాక్సాఫీస్ నా.. ఏ రేంజ్ లో కొల్లగొడతారో అన్న ఉత్కంఠ పెరిగిపోతోంది.
ప్రస్తుతం శంకర్ తో రామ్ చరణ్ చేస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకుంది. తొలుత ఈ మూవీని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించింది యూనిట్. అయితే అదే సమయానికి ప్రభాస్ ప్రాజెక్ట్ కే, సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ మూవీ రెండూ ఫైట్ కి రెడీ అవుతున్నాయి. దీంతో తమ మూవీని వచ్చే మార్చి చివర్లో రిలీజ్ చేయాలని ఆలోచన చేస్తోందట యూనిట్.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తెరకెక్కిస్తున్న మూవీని కూడా 2024 ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు ఆ మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో వచ్చే ఏడాది సమ్మర్ కు బిగ్ ఫైట్ తప్పేలా లేదు. అయితే ఫిలింనగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. గేమ్ చేంజర్ మూవీ యూనిట్, ఎన్టీఆర్ మూవీ రిలీజ్ కి రెండు వారాలు గ్యాప్ ఉండేలా మార్చి 20న తమ సినిమాని రిలీజ్ చేయడమే బెటర్ అని భావిస్తోందని తెలుస్తోంది. చూడాలి మరి ఇద్దరూ ఒకేసారి బాక్సాఫీస్ ని షేక్ చేయబోతారా లేక డేట్లు మార్చుకొని కలెక్షన్స్ కొల్లగొడతారా.. అన్నది.