
స్టార్ హీరోయిన్ సమంత నటించిన యశోద పై తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. దాంతో పెద్ద వివాదమే అయింది. ఇవా అనే ఫెర్టిలిటీ సంస్థ పేరు యశోద సినిమాలో ఉండటంతో సదరు సంస్థ డబ్బుల కోసం అడ్డదార్లు తొక్కుతూ ఉంటుందని సినిమాలో చూపించడంతో ఆగ్రహించిన ఇవా సంస్థ 5 కోట్ల పరువు నష్టం దావా వేసింది. ఇవా సంస్థ కోర్టును ఆశ్రయించడంతో యశోద చిత్రం థియేటర్ లలో విడుదల అయ్యింది కాబట్టి ఏమి చేయలేమని కానీ ఓటీటీ లో మాత్రం విడుదల చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.
అయితే కోర్టు వ్యవహారం అంత తొందరగా తేలదు కాబట్టి రంగంలోకి దిగాడు చిత్ర నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. ఇవా మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ రావు తో మాట్లాడి సమస్యను పరిష్కరించుకున్నాడు. ఇవా ivf వాళ్ళు కూడా సమస్య పరిష్కారం అవుతుందంటే మంచిదేగా అన్నట్లుగా వ్యవహరించాడు ……. దాంతో యశోద సమస్య ఓ కొలిక్కి వచ్చింది. ఇంకేముంది మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని స్పష్టం చేసారు.
సరోగసీ నేపథ్యంలో యశోద చిత్రం రూపొందింది. థియేటర్ లలో ఈ సినిమా ఫరవాలేదనిపించింది. త్వరలోనే ఓటీటీ లోకి రాబోతోంది అనుకునేలోపు సమస్య తలెత్తింది. కట్ చేస్తే కోర్టు కు సమస్య పరిష్కరించుకున్నామని చెప్పడంతో కోర్టు కూడా అంగీకరించింది. దాంతో ఓటీటీ కి లైన్ క్లియర్ అయ్యింది. అంటే త్వరలోనే యశోద సినిమా ఓటీటీ లో రాబోతోంది అన్నమాట.