
గతకొంత కాలంగా సీనియర్ నటుడు నరేష్ – పవిత్రా లోకేష్ ల వ్యవహారం సీరియల్ లా సాగుతూ పలు ట్విస్ట్ లతో వీక్షకులకు నయనానందం కలిగిస్తున్న విషయం తెలిసిందే. అయితే అది వాళ్ళ ఘాడమైన ప్రేమ అని అనుకున్నారు అందరూ కానీ నరేష్ దగ్గర ఉన్న 1500 కోట్ల ఆస్తిని కాజేయడానికి మాత్రమే అతడితో పవిత్ర ఉంటోందని సంచలన వ్యాఖ్యలు చేసాడు పవిత్ర లోకేష్ మాజీ భర్త సుచేంద్ర.
నటి పవిత్రా లోకేష్ కు ఇంతకుముందు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరు సంతానం కూడా. అయితే రెండు పెళ్లిళ్లు కూడా పెటాకులే అయ్యాయి. ఆ తర్వాత కొంతమందితో సహజీవనం కూడా చేసినట్లు పలు ఆరోపణలు చేస్తున్నాడు మాజీ భర్త. అంతేనా పవిత్రా లోకేష్ కు ఆ యావ ఎక్కువ అని సంచలన కామెంట్స్ చేసాడు.
విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిందని , డబ్బు లేకపోతే ఆమె ఉండదని …… నరేష్ దగ్గర విజయనిర్మల సంపాదించిన 1500 కోట్ల ఆస్థి ఉంది కాబట్టే అతడితో ఉంటోంది. ఆ ఆస్థి కాజేసేంత వరకు నరేష్ తో ఉంటుంది. ఆస్తి కాజేసిన తర్వాత అతడ్ని విడిచి పెడుతుంది. ఈ విషయం నరేష్ కు ఇప్పుడు చెప్పినా అర్ధం కాదు ఎందుకంటే పవిత్రా లోకేష్ క్యారెక్టర్ అలాంటిది మరి అని అంటున్నాడు.
గతకొంత కాలంగా నరేష్ – పవిత్రా లోకేష్ వీక్షకులకు కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్నారు. ఈ జంట వ్యవహారం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా ….. సోషల్ మీడియాలో ఎంతగా ట్రోల్ చేస్తున్నా వీళ్ళు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు మరి.