పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం ” భీమ్లా నాయక్ ”. సాగర్ కె . చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ రచన అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రాన్ని అప్పుడే హిందీలో కూడా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సాంకేతిక కారణాల వల్ల అది వాయిదా పడింది. కట్ చేస్తే ఇన్ని రోజుల తర్వాత భీమ్లా నాయక్ చిత్రాన్ని హిందీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అయితే హిందీలో నేరుగా థియేటర్ లలో విడుదల చేయడం లేదు. థియేటర్ లలో కాకుండా నేరుగా సెట్ మ్యాక్స్ లో బుల్లితెరపై విడుదల చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన పలు చిత్రాలు హిందీలో డబ్ అయ్యాయి మంచి విజయాన్ని సాధించాయి. అలాగే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించగా రానా రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ గా నటించాడు. ఇక పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ నటించగా రానా సరసన సంయుక్త మీనన్ నటించింది. సముద్రఖని , కాదంబరి , తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.