తమ్ముడు పవన్ కళ్యాణ్ కు అడ్వాన్స్ గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసాడు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి . నిన్న రాత్రి హైదరాబాద్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో అనే చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా సెప్టెంబర్ 2 న విడుదల అవుతుండటంతో అదే రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కాబట్టి అడ్వాన్స్ గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ అభిమానులను ఉద్దేశించి తెలిపారు చిరు.
దాంతో ఒక్కసారిగా మెగా అభిమానులు ఈలలు , గోలలతో హాల్ హాలంతా దద్దరిల్లేలా అరిచారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు యువతలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇక మెగా ఫంక్షన్ ఏదైనా సరే అక్కడ పవర్ స్టార్ …… పవర్ స్టార్ అంటూ నానా హంగామా చేస్తారు పవర్ స్టార్ ఫ్యాన్స్.
Breaking News