
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు బాలయ్య అన్ స్టాపబుల్ 2 షోకు వస్తున్నాడు. ఈ నెలాఖరున లేదంటే జనవరిలో ఈ షో షూటింగ్ జరుగనున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తో పాటుగా దర్శకులు త్రివిక్రమ్ కూడా ఈ షోలో పాల్గొననున్నాడు. దాంతో ఈ షో బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకే వేదిక మీద అటు బాలయ్య ఇటు పవన్ కళ్యాణ్ అంటే చూడముచ్చటగా ఉండటం ఖాయం.
నందమూరి బాలకృష్ణ ఆహా కోసం చేస్తున్న షో ” అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే ”. మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ కావడంతో రెండో సీజన్ స్టార్ట్ చేసారు. ఇక రెండో సీజన్ కూడా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ షోకు పలువురు యంగ్ హీరోలు అలాగే దర్శక నిర్మాతలు హాజరయ్యారు. ఇక ఇప్పడు పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది.
గతంలోనే….. పవన్ కళ్యాణ్ ను ఈ షోకు తీసుకురావాలని త్రివిక్రమ్ ను బాలయ్య కోరిన విషయం తెలిసిందే. ఆ మాట ప్రకారం పవన్ కళ్యాణ్ బాలయ్య షోకు వస్తున్నాడు. ఇక బాలయ్య షో ను చూసిన పవన్ కళ్యాణ్ కూడా షో బాగుందని , బాలయ్య ఈ షోను డిఫరెంట్ గా చేస్తున్నాడని సంతృప్తి వ్యక్తం చేసాడట. అందుకే ఈ షోకు హాజరు కావడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడట.