
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బైక్ లంటే చాలా చాలా ఇష్టం. దాంతో కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా బైక్ లు వాడేవాడు. అంతేకాదు కొత్తగా ఏ బైక్ వచ్చినా సరే దాన్ని కొనేవాడు. హైదరాబాద్ మహా నగరంలో రాత్రుళ్ళు బైక్ పై తిరిగేవాడు.
అంతేకాదు మారువేశంలో అలాగే ముఖం , తల కవర్ అయ్యేలా మాస్క్ ధరించి వెళ్ళేవాడు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ కు ఊహించని , ఎవరికీ దక్కని ఇమేజ్ సొంతం అయ్యింది. దాంతో బైక్ పై తిరిగే అవకాశం లేకుండా పోయింది.
కట్ చేస్తే …… రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రస్తుతం హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. భారీ ఎత్తున యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకులు క్రిష్. అయితే షూటింగ్ సమయంలో బ్రేక్ లభించడంతో ఆ గ్యాప్ లో బైక్ పై రైడ్ చేస్తూ ఎంజాయ్ చేసాడు.
రామోజీ ఫిల్మ్ సిటీ చాలా విశాలంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా బైక్ రైడ్ చేసాడు. ఇంకేముంది పవన్ కళ్యాణ్ అలా బైక్ రైడ్ చేస్తుంటే కెమెరాకు పని చెప్పారు. క్లిక్ ….. క్లిక్ మనిపించారు. ఆ ఫోటోలు ఇలా వైరల్ గా మారాయి.