
అన్ స్టాపబుల్ 2 కొత్త ఎపిసోడ్ రికార్డుల మోత మోగిస్తోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో దేశంలోనే నెంబర్ వన్ షోగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అడుగు పెట్టడంతో ఇక రికార్డుల మోత మోగిస్తోంది. నిన్న రాత్రి 9 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కి వచ్చింది ఈ ఎపిసోడ్.
బాలయ్య – పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో కొన్ని చోట్ల థియేటర్ లలో స్పెషల్ స్క్రీనింగ్ కూడా ఏర్పాటు చేసారు ఆహా మేకర్స్. ఈ స్క్రీనింగ్ కు భారీ ఎత్తున స్పందన వచ్చింది. ఇక ఆహాలో స్ట్రీమింగ్ కి అలా రావడమే ఆలస్యం ఇలా మీద పడిపోయారు పవన్ ఫ్యాన్స్. దాంతో కొంత ఇబ్బంది ఏర్పడినప్పటికీ ఆహా టెక్నికల్ టీమ్ పలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రేక్షకులకు పెద్దగా ఇబ్బంది లేకుండాపోయింది.
ఇక ఈ ఎపిసోడ్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. మొదటి అయిదు నిమిషాల్లో మొదటి 90 నిమిషాల్లో అత్యధిక వ్యూస్ సాధించిన ఎపిసోడ్ అంటూ ఆహా టీమ్ అధికారికంగా ప్రకటించింది. మొత్తానికి ఈ ఇంటర్వ్యూకు అనూహ్య స్పందన వస్తుండటంతో ఆహా మేకర్స్ చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక ఈనెల 10 న రెండో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కి రానుంది. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా తెస్తున్నారు ఆహా సిబ్బంది.