పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రవితేజ – రేణు దేశాయ్ ల మధ్య పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయ్యిందట. ఈ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ముఖ్యంగా సెంటిమెంట్ సీన్స్ ప్రేక్షకులను విశేషాంగా అలరించడం ఖాయమని, కంటతడి కూడా పెట్టించడం ఖాయమని అంటున్నారు.
రేణు దేశాయ్ కు ఈ సినిమా మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని అంటున్నారు. అసలు రేణు దేశాయ్ హీరోయిన్ గా సినిమాల్లోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ సరసన బద్రి సినిమాలో నటించింది. ఇక ఆ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ కు దగ్గర కావడంతో బయటి సినిమాలు చేయొద్దని నిర్ణయించుకుంది. అందుకే జానీ చిత్రంలో మాత్రమే నటించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో సహజీవనం చేస్తూ పెళ్లి చేసుకుంది. కానీ ఇద్దరు పిల్లలు అయ్యాక విబేధాలు రావడంతో విడిపోయారు.
పవన్ కళ్యాణ్ కు విడాకులు ఇచ్చాక తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఉండిపోయింది. ఇక ఇప్పుడేమో నటిగా బిజీ కావాలని అనుకుంటున్న సమయంలో టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో మంచి పాత్ర లభించడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రం తప్పకుండా నటిగా నాకు మరిచిపోలేని అనుభూతిని ఇస్తుందని బలంగా నమ్ముతోంది.