Pawan Kalyan
సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో: ది అవతార్’. ఈ సినిమా ఈ నెల 28వ తేదీన థియేట్రికల్ రిలీజ్ అవుతుందని గతంలోనే ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న (జూలై 25న) శిల్పకళా వేదికలో అట్టహాసంగా నిర్వహించారు. సుమ యాంకర్ గా వ్యవహరించిన ఈ వేదికపై పవన్ కళ్యాణ్ సుమారు 30 నిమిషాల పాటు మాట్లాడారు. మధ్యలో ‘ఉప్పెన’ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కల్పించుకోవడంతో కొంత అసహనం వ్యక్తం చేశాడు పవన్ కళ్యాణ్.
మల్టీ స్టారర్ చిత్రంగా బ్రో: ది అవతార్ తెరకెక్కించారు. ‘పీపుల్స్ మీడియా’ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాతగా టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. సముద్రఖని దర్శకత్వం వహించారు. తమిళంలో హిట్టయిన వినోదయ సీతం రీమేక్ బ్రో. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ బాణీలు సమకూర్చాడు.
బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హీరోలు పవన్, సాయి తేజ్ తోపాటు డైరెక్టర్ సముద్రఖని, బ్రహ్మానందం, హీరోయిన్లు ప్రియా ప్రకాశ్ వారియర్, కేతికా శర్మ, ఊర్వశీ రౌటెలా, సీనియర్ నటి రోహిణి, తమన్, నిర్మాతలు, తదితరులు హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరి పేరు గుర్తు పెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ చిట్టీ రాసుకచ్చారు. దర్శకుడు సముద్రఖని, అల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి పొగుడుతూ మాట్లాడారు. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పుకొచ్చారు.
మణిశర్మ దగ్గర పని చేస్తున్నప్పటి నుంచి తమన్ తెలుసన్న ఆయన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చేశానని చెప్పాడు. ఇప్పుడు ‘బ్రో’తో హ్యాట్రిక్ కొట్టబోతున్నాం అన్నాడు. తర్వాత హీరోయిన్స్, టెక్నీషియన్స్ ఒక్కొక్కరిగా పేర్లు చెబుతూ వచ్చారు. వీరి గురించిన చెప్పిన తర్వాత మళ్లీ సాయి ధరమ్ తేజ్ వైపు పవన్ ప్రసంగం మళ్లింది. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్, కోమా, తేజ్ ను కాపాడిన అబ్దుల్ కు కృతజ్ఞతలు తెలుపుతూ మాట్లాడారు. ప్రసంగం మధ్యలో పవన్ వెనకే నిలుచున్న వైష్ణవ్ తేజ్ సిగ్నల్ ఇచ్చాడు.
నిర్మాతల గురించి చెప్పండని వైష్ణవ్ గుర్తు చేశాడు. పవన్ వెనక్కి తిరిగి అసహనం వ్యక్తం చేశాడు. ‘చెబుతా’ అన్న పవన్ కల్యాణ్.. ‘నాకు తెలుసు. నేను మరిచిపోను’ అన్నట్లుగా చేతి కదలిక ద్వారా చూపించారు. ‘నిర్మాతల గురించి ఎలా మర్చిపోతాను. సినిమాను ఇంత ఫాస్ట్ గా తీసేందుకు కారణం విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబోట్ల కారణం. దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
Vaishnav Gaadu 🤣🤣🤣🤣🤣 pic.twitter.com/ISnbsjyaPH
— Raees (@RaeesHere_) July 25, 2023