
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. అసలు ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండే కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ షూటింగ్ ఆలస్యమైంది.
ఇక నిన్న హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో హరిహర వీరమల్లు షూటింగ్ స్టార్ట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ పై అలాగే చిత్ర యూనిట్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకులు క్రిష్. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో గజదొంగగా నటిస్తున్నాడు. పవన్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ నటిస్తోంది.
ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి రిహార్సల్స్ పెద్ద ఎత్తున చేసారు. పవన్ కళ్యాణ్ , నిధి అగర్వాల్ తో పాటుగా ఈ సినిమాలో నటించే మిగతా నటీనటులు కూడా రిహార్సల్స్ లో పాల్గొన్నారు. కొన్ని రోజులు రాజకీయాలకు అలాగే కొన్ని రోజులు సినిమాలకు డేట్స్ కేటాయిస్తుండటంతో హరిహర వీరమల్లు చిత్రం ఆలస్యం అవుతోంది.