సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు దాంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని హరిహర వీరమల్లు చిత్రం నుండి పవర్ ఫుల్ గెటప్ లో ఉన్న పవన్ కళ్యాణ్ స్టిల్ విడుదల చేసారు. ఇంకేముంది వీరోచితంగా ఉన్న పవన్ కళ్యాణ్ స్టిల్ అభిమానులను ఫిదా అయ్యేలా చేసింది. దాంతో ఆ స్టిల్ చూసి తెగ సంతోషిస్తున్నారు పవర్ స్టార్ అభిమానులు.
క్రిష్ దర్శకత్వంలో ఏ ఎం రత్నం నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటోంది. పవన్ కళ్యాణ్ ఒకేసారి బల్క్ గా ఈ సినిమా కోసం డేట్స్ ఇవ్వడం లేదు దాంతో వీలున్న సమయాల్లో మాత్రమే షూటింగ్ జరుగుతోంది. అందుకే ఈ సినిమా ఆలస్యం అవుతోంది.
ఇక సెప్టెంబర్ 2 న తమ అభిమాన హీరో పుట్టినరోజు కావడంతో జల్సా చిత్రాన్ని అలాగే తమ్ముడు చిత్రాన్ని చాలా చోట్ల వేస్తున్నారు. జల్సా చిత్రానికి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే 500 కుపైగా స్క్రీన్ లు లాక్ అవ్వగా మరో 100 నుండి 200 స్క్రీన్ ల వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Breaking News