పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సా చిత్రంతో రికార్డుల మోత మోగించాడు. 2008 లో విడుదలైన జల్సా చిత్రం అప్పట్లో కూడా రికార్డుల మోత మోగించింది. కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత సెప్టెంబర్ 2 , 2022 న మళ్ళీ విడుదల చేసారు అభిమానుల కోసం. ప్రపంచ వ్యాప్తంగా 702 కు పైగా స్క్రీన్ లలో ఈ చిత్రాన్ని విడుదల చేయగా 3కోట్ల 20 లక్షల వసూళ్ళని సాధించి చరిత్ర సృష్టించింది జల్సా చిత్రం.
రీ రిలీజ్ లో కేవలం 702 స్క్రీన్ లలో విడుదలై 3 కోట్లకు పైగా వసూళ్లను సాధించడం అంటే మాములు విషయం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్న ఇమేజ్ వల్ల ఇది సాధ్యమైంది. తమ అభిమాన హీరో మీదున్న అభిమానాన్ని ఇలా వసూళ్ల రూపంలో ప్రదర్శించారు పవర్ స్టార్ అభిమానులు.
సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో జల్సా చిత్రాన్ని 4 K రెసొల్యూషన్ లో విడుదల చేసారు. విడుదలైన అన్ని చోట్ల వసూళ్ల వర్షం కురిపించింది. ఇక ఇలా వచ్చిన 3 కోట్ల పైచిలుకు డబ్బులను సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. అయితే అభిమానుల అత్యుత్సాహం వల్ల కొన్ని చోట్ల థియేటర్ లు ధ్వంసం అయ్యాయి. దాంతో ఆ థియేటర్ యజమానులు లబోదిబో మంటున్నారు.
Breaking News