
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నాడు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో అన్ స్టాపబుల్ షో కోసం వచ్చాడు పవన్ కళ్యాణ్. ఈ ఎపిసోడ్ ప్రత్యేకత ఏమిటంటే…… బాలయ్య స్వయంగా పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలకడం విశేషం. ఇక బాలయ్య – పవన్ కళ్యాణ్ అభిమానులను కూడా ఈ షోకు కొంతమందిని అనుమతిచ్చారు. దాంతో పవన్ కళ్యాణ్ – బాలకృష్ణ లను చూసి పరవశించి పోయారు……. పెద్ద ఎత్తున జై బాలయ్య …… పవర్ స్టార్ అంటూ నినాదాలు ఇస్తూ సందడి చేశారు.
బాలయ్య షోలో పవన్ కళ్యాణ్ పాల్గొనడం పట్ల అటు బాలయ్య అభిమానులు ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా చాలా సంతోషంగా ఉన్నారు. బాలయ్య అన్ స్టాపబుల్ షో బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. దాంతో బాలయ్య షోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అలాంటి షోలో పవన్ కళ్యాణ్ పాల్గొంటే ఈ షో మరింత సంచలనం సృష్టించడం ఖాయం.
ఈ షోలో బాలయ్య ఎలాంటి ప్రశ్నలను సంధించనున్నాడో ? అలాగే పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాధానాలు చెప్పనున్నాడో అనే ఆతృత నెలకొంది. మొత్తానికి ఈ షో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.