
నన్ను పదేపదే ప్యాకేజ్ స్టార్ అని అంటే చెప్పుతో కొడతా నా కొడకల్లారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇటీవల వైజాగ్ పర్యటనకు వెళ్లిన సమయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. దాంతో పోలీసులు పవన్ కళ్యాణ్ కు అనుమతి నిరాకరించడంతో అక్కడి నుండి మంగళగిరి చేరుకున్నారు.
ఇక వైసీపీ నాయకులను , మంత్రులను తీవ్ర వ్యాఖ్యలతో దుర్భాశ లాడారు పవన్. తనని ప్యాకేజ్ స్టార్ అని అంటే చెప్పుతో కొడతానని చెప్పు చూపించారు. ఇక కొట్టుకుందాం …… తన్నుకుందాం…… కత్తులతో వస్తారా ? కర్రలతో వస్తారా ? తేల్చుకుందామా ? అంటూ వైసీపీ నాయకులను తీవ్ర హెచ్చరికలు చేశారు.