
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రారంభమైంది. హైదరాబాద్ లో ఈరోజు ఈ సినిమా ప్రారంభమైంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తుండగా పవన్ కళ్యాణ్ కీలక పాత్రలో నటించనున్నాడు. తమిళంలో విజయం సాధించిన ” వినోదయ సీతమ్ ” చిత్రానికి రీమేక్ ఇది.
తమిళ్ లో ప్రముఖ నటుడు , దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో దాన్ని తెలుగులో రీమేక్ చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాడు పవన్ . అయితే అది ఇన్ని రోజులకు సెట్ అయ్యింది. ఈరోజు షూటింగ్ ప్రారంభమైంది హైదరాబాద్ లో. సాయిధరమ్ తేజ్ – పవన్ కళ్యాణ్ లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రానికి సముద్రఖని దర్శకుడు కావడం గమనార్హం.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ అభినవ దేవుడిగా నటిస్తున్నాడు. దేవుడు అనగానే పాత సినిమాల్లో లాగా కిరీటాలు , గ్రాంథిక డైలాగ్స్ ఉండవు …… ఎందుకంటే గోపాల గోపాల అనే చిత్రంలో పవన్ కళ్యాణ్ ఇంతకుముందు నటించినట్లుగానే ఈసినిమాలో కూడా మోడ్రన్ దేవుడుగా నటించనున్నాడు. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడం ఖాయం.