పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా జనవరి 30 న ప్రారంభం కానుంది. కుర్ర డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఆ సినిమా ప్రారంభం జనవరి 30 న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాని అగ్ర నిర్మాత డివివి దానయ్య నిర్మించనున్నాడు.
అసలు పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలు ఇప్పటికే మూడు సెట్స్ మీద ఉన్నాయి. హరిహర వీరమల్లు సినిమా సగానికి పైగా పూర్తయ్యింది. అయితే అది ఎప్పుడు పూర్తి అవుతుందో ? ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రెగ్యులర్ గా ఆ సినిమాకు డేట్స్ ఇవ్వడం లేదు ….. అప్పుడు కొన్ని రోజులు …… అప్పుడు కొన్ని రోజులు డేట్స్ ఇస్తున్నాడు దాంతో అది సీరియల్ లా సాగుతోంది.
ఇక ఆ సినిమా అలా ఉండగానే హరీష్ శంకర్ తో ఎప్పుడో ఓ సినిమా అనౌన్స్ చేసారు ….. పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం జరగడం లేదు. అది సరిపోనట్టు మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటించే సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అది కూడా అలా ఉంది. ఇలాంటి సమయంలో జనవరి 30 న సుజిత్ దర్శకత్వంలో రూపొందే సినిమా కు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో ? ఎప్పుడు పూర్తి అవుతుందో ? చూడాలి. మొత్తానికి పవన్ ఫ్యాన్స్ కు సంతోషకరమైన వార్త అనే చెప్పాలి కొత్త సినిమా ప్రారంభం అంటే .