హైదరాబాద్ నుండి ర్యాలీ గా బయలుదేరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు పవన్. కొండగట్టులో తన ప్రచార వాహనమైన వారాహి కి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అంజనీ పుత్రుడైన పవన్ కళ్యాణ్ ( పవన్ కళ్యాణ్ తల్లి పేరు అంజనా దేవి అనే విషయం తెలిసిందే) అంజనీ పుత్రుడైన ఆంజనేయ స్వామిని దర్శించుకుని స్వామి వారి ఆశీర్వాదం తీసుకోనున్నారు.
ఇక కొండగట్టు నుండి ధర్మపురికి చేరుకోనున్నారు. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ని దర్శించుకుని స్వామి వారి ఆశీర్వాదం పొందనున్నారు. పవన్ కళ్యాణ్ కొండగట్టు, ధర్మపురి కి వస్తుండటంతో పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు.