పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సంచలన చిత్రం ” ఖుషి ”. 2001 లో వచ్చిన ఈ చిత్రం తెలుగు చలన చిత్ర రికార్డులను బద్దలు కొట్టింది. ఇక పవన్ కళ్యాణ్ ను పవర్ స్టార్ ను చేసిన సినిమా ఇదే. పవన్ కళ్యాణ్ సరసన భూమిక నటించింది. ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏ ఎం రత్నం నిర్మించాడు.
కట్ చేస్తే ఇన్నాళ్లకు ఈ సినిమా మళ్ళీ విడుదల అవుతోంది. డిసెంబర్ 31న రెండు తెలుగు రాష్ట్రాలలో ఖుషి చిత్రాన్ని మళ్ళీ విడుదల చేస్తున్నారు. యూత్ ని బాగా కనెక్ట్ అయ్యే సినిమా కావడంతో డిసెంబర్ 31 న విడుదల చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి తప్పకుండా ఖుషి చిత్రం మరోసారి బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం.
కేవలం ఒక్క రోజు మాత్రమే విడుదల చేస్తున్నారు. కొత్త ఏడాదిలోకి స్వాగతం పలుకుతూ ఈ సినిమాను ఆస్వాదించనున్నారు పవర్ స్టార్ అభిమానులు. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా బహుళ జనాదరణ పొందాయి. దాంతో థియేటర్ లలో ఖుషి చిత్రానికి అద్భుతమైన స్పందన రావడం ఖాయం.