
నటీనటులు :నాగశౌర్య , మాళవిక నాయర్
సంగీతం : కళ్యాణి మాలిక్
నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్ , దాసరి పద్మజ
దర్శకత్వం : అవసరాల శ్రీనివాస్
రిలీజ్ డేట్ : 17 మార్చి 2023
రేటింగ్ : 3/5
నాగశౌర్య – మాళవిక నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి ”. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించేలా ఉందా ? లేదా ? అన్నది చూద్దామా !
కథ :
బిటెక్ కాలేజ్ లో సంజయ్ ( నాగశౌర్య ) ను ర్యాగింగ్ చేస్తుంటే అదే సమయంలో సీనియర్ అయిన అనుపమ ( మాళవిక నాయర్ ) కాపాడుతుంది. దాంతో సంజయ్ – అనుపమ మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఆ ఫ్రెంఢ్షిప్ కాస్త ముదిరి ప్రేమలో పడతారు. ఎంఎస్ చేసే సమయంలో లండన్ వెళ్లి అక్కడ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటారు. అయితే అక్కడ అనూహ్యంగా ఇద్దరి మధ్య విబేధాలు వస్తాయి దాంతో దూరమౌతారు. సంజయ్ కు పూజ( మేఘా చౌదరి ) పరిచయం కావడంతో ఆ దూరం మరింత పెరుగుతుంది. ఈ విబేధాలు సమసిపోయి సంజయ్ – అనుపమ ఒక్కటయ్యారా ? లేదా ? వాళ్ళ కథ ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
హైలెట్స్ :
నాగశౌర్య
మాళవిక నాయర్
సంగీతం
ఎంటర్ టైన్ మెంట్
డ్రా బ్యాక్స్ :
ట్విస్ట్ లు లేకపోవడం
సాగతీత , ఊహాతీత సన్నివేశాలు
నటీనటుల ప్రతిభ : నాగశౌర్య కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే దాంతో అవలీలగా నటించేసాడు. పాత్రకు తగ్గట్లుగా తనని తాను మలుచుకున్నాడు. మాళవిక నాయర్ కు మంచి పాత్ర లభించింది దాంతో తన సత్తా చాటేలా నటించి మెప్పించింది. ఇక మిగిలిన పాత్రల్లో అవసరాల శ్రీనివాస్ , మేఘా చౌదరి తదితరులు తమతమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.
సాంకేతిక వర్గం :
సునీల్ కుమార్ నామా అందించిన విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. సుందరమైన లొకేషన్ లను అంతే అద్భుతంగా చూపించాడు. కళ్యాణి మాలిక్ అందించిన పాటలు బాగున్నాయి అలాగే నేపథ్య సంగీతం కూడా అలరించేలా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే దర్శకుడు అవసరాల శ్రీనివాస్ మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు.
ఓవరాల్ గా :
పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా ఉంటే బెటర్.