
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త ……. పవర్ స్టార్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులు ఎట్టకేలకు శుభవార్త తెలిపారు. ఇంతకీ ఆ శుభవార్త ఏంటో తెలుసా …….. పవన్ కళ్యాణ్ – సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. ఇటీవలే ఆ సినిమా ప్రారంభమైంది కదా ! అప్పుడే రిలీజ్ డేట్ వచ్చేసిందా ? అని అనుకుంటున్నారా ? అవును …… రిలీజ్ డేట్ ప్రకటించేసారు ….. జూలై 28 , 2023 న విడుదల చేయనున్నట్లు డేట్ అనౌన్స్ చేసారు.
పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి 20 రోజులు మాత్రమే పని చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ దేవుడిగా నటిస్తుండగా సాయిధరమ్ తేజ్ మానవుడిగా నటిస్తున్నాడు. అంటే ఎక్కువగా షూటింగ్ సాయిధరమ్ తేజ్ మీదే ఉండనుంది. పవన్ కళ్యాణ్ దాదాపు గంట సేపు మాత్రమే ఉంటాడు. దాంతో శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
ఇక ఈ సినిమా తమిళంలో విజయం సాధించిన వినోదయ సీతం చిత్రానికి రీమేక్. నటుడు , దర్శకుడు సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే సమకూర్చుతున్నాడు. జూలై 28 న సినిమా రిలీజ్ అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పుకోవాలి.