
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ అనే విషయం తెలిసిందే. తాజాగా ఓ వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాడు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే……. ఓ గ్రామంలోని చెరువు దగ్గరగా కొంతమంది యువకులు ఓ మహిళను కర్రలతో చితకబాదుతున్నారు. కర్రలతో మాత్రమే కాకుండా కాళ్ళతో ఎగిరి తంతున్నారు. ఇష్టమొచ్చినట్లు తిడుతూ ఘోరంగా హింసిస్తున్నారు. ఆ వీడియో కనుక చూస్తే …… రక్తం సలసలా మరగడం ఖాయం. అంతేకాదు ఆ నా కొడుకులు కనిపిస్తే ముక్కలు ముక్కలు గా నరికేయ్యాలి అనేంత కోపం కూడా వస్తోంది.
అయితే ఆ వీడియో ఎప్పటిది ? అనే వివరాలు లేవు. ఈ వీడియో ను చాలామంది షేర్ చేయడంతో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా షేర్ చేసింది. అలాగే దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా షేర్ చేసాడు. అంతేకాదు వాళ్ళను చంపేయండి అని అంటున్నాడు. దాంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
Can some relevant authorities please kill these bastards https://t.co/xFNzVQz4U9
— Ram Gopal Varma (@RGVzoomin) February 4, 2023