స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తన బాడీ లోని ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇంతకీ పూజా హెగ్డే సర్జరీ చేయించుకుందనే పార్ట్ ఏంటో తెలుసా …….. ముక్కు. అవును ముక్కుకు సర్జరీ చేయించుకుందని రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఈ పుకార్లు మరీ ఎక్కువ కావడంతో ఎట్టకేలకు స్పందించింది పూజా హెగ్డే టీమ్.
ఆమె ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని , కాకపోతే విదేశాలకు మాత్రం హోలీ డేస్ ను ఎంజాయ్ చేయడానికి వెళ్లిందని అంతేతప్ప సర్జరీ అనే మాట వట్టి అబద్దమని కొట్టి పడేసారు పూజా టీమ్. సాధారణంగా హీరోయిన్ లు తమ బాడీ లో ఎలాంటి లోపాలున్నా వాటికి సర్జరీ చేయించుకుంటారు. అలా సర్జరీ చేయించుకున్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. ఇక పూజా హెగ్డే కూడా అలాగే సర్జరీ చేయించుకుందని ఊహాగానాలు చెలరేగాయి . అయితే వాటిని ఖండించారు కానీ సాధారణంగా ఇలా ఖండిస్తూనే ఉంటారు…… నిజాలను.