మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం ” వాల్తేరు వీరయ్య ”. 2023 జనవరి 13 న విడుదల కానున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి 3 పాటలు విడుదల కాగా మూడు కూడా బాగానే ఉన్నాయి. అయితే ఈరోజు పూనకాలు లోడింగ్ అంటూ వచ్చిన పాట రచ్చ రంబోలా అనిపించేలా ఉంది.
ఈరోజు హైదరాబాద్ లోని మెయిన్ థియేటర్ లో ఈ సినిమా నుండి పాటను ప్రదర్శించారు. దీన్ని ఒక వేడుకలా చేసారు చిత్ర బృందం. ఈ పాటను థియేటర్ లో ప్రదర్శించగా మెగా అభిమానులు ఈలలతో గోలలతో రచ్చ రచ్చ చేసారు. వాళ్ళ హడావుడి పక్కన పెడితే నిజంగానే ఈ పాట పూనకాలు తెప్పించేలాగే ఉంది.
మెగాస్టార్ చిరంజీవి , మాస్ మహారాజ్ రవితేజ లపై ఈ పాటను చిత్రీకరించారు. దాంతో ఈ పాటకు మరింత అందం వచ్చింది. అసలే ఇద్దరు కూడా మాస్ హీరోలు దానికి తోడు ఊర మాస్ సాంగ్ కావడంతో నిజంగానే అభిమానులు పూనకాలతో ఊగిపోయేలా రూపొందించారు ఈ పాటను. చిరంజీవి సరసన శృతి హాసన్ నటించగా రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. సంక్రాంతి తెలుగువాళ్ళకు పెద్ద పండగ. ఆ పండగ సందర్బంగా ఈ వాల్తేరు వీరయ్య రిలీజ్ కానుంది.