పూనం కౌర్ అనారోగ్యం పాలైంది. దాంతో చికిత్స తీసుకొని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది. తెలుగుతెరపై హీరోయిన్ గా నటించిన భామ పూనం కౌర్ . అయితే హీరోయిన్ గా నటించిన సినిమాలు అంతగా ఆడలేదు. దాంతో కెరీర్ పరంగా చాలా వెనుకబడిపోయింది. అయితే ఓ స్టార్ దర్శకుడ్ని అలాగే ఓ స్టార్ హీరోను విమర్శించి సోషల్ మీడియాలో బాగానే పాపులర్ అయ్యింది.
కట్ చేస్తే ….. చేనేత వస్త్రాలపై మోడీ సర్కార్ జీఎస్టీ విధించడంతో ఆ జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టింది. గుజరాత్ లోని సూరత్ లో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ పలు పరీక్షలు నిర్వహించగా ” ఫైబ్రో మాయాల్జియా ” అనే వ్యాధికి గురైనట్లుగా డాక్టర్లు తెలిపారు.
దాంతో కేరళ వెళ్లి చికిత్స తీసుకుంది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది. అయితే పూనం కౌర్ అనారోగ్యంపై మీడియాలో దుమారం చెలరేగడంతో నేను బాగానే ఉన్నాను అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.