ఒక్కోసారి హీరోయిన్లు ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం కాదు. అసలు వాళ్లు చేసే కామెంట్స్ ఎందుకు, ఎవరి కోసమే తెలియకుండా చేస్తారు. చెప్పీ, చెప్పనట్లు చేసే ట్వీట్లు అర్థమయ్యీ, అవనట్లుగా అప్పుడప్పుడు అవి కూడా నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకునే పేరు పూనమ్ కౌర్‌దే.
ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఆమె అందం గురించే ఎక్కువగా టాక్ వినిపించేది. తూకానికి కూడా లొంగనంత అందం ఆమెది. ఇక ఎక్ప్రెషన్స్ కయితే ఢోకానే లేదు. ఏ సీన్ ఎలా పండుతుందో ఆమెకు బాగా తెలుసు. అయితే చాలా సార్లు వింత వింత ట్వీట్లు చేస్తూ వివాదంలో పడుతుంది పూనమ్ కౌర్. తెలుగులో చెప్పుకోదగ్గ సినిమా చేయకున్నా ఆమె వేసే కౌంటర్లు మాత్రం జనాల నోళ్లలో నానుతుంది. కానీ నటనా పరంగా ఎప్పుడో షెడ్డుకి వెళ్లిపోయింది ఈ అమ్మడు.
అప్పట్లో ఆమె గవర్నర్ తమిళిసై ముందు అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజున ఏడుస్తూ తన గోడు వెళ్లబోసుకుంది. తను పంజాబీ అయినా తెలంగాణలోనే పుట్టి, పెరిగానని ఇక్కడ ఇండస్ట్రీ తనను వెలివేస్తున్నదని బోరుమంది పూనమ్. అప్పట్లో ఆ కామెంట్లు బాగా వైరల్ గా మారాయి. రీసెంట్ గా (గురు పౌర్ణమి’ నాడు ఆమె మరో ట్వీట్ చేసి వైరల్ అయ్యింది.
అదే రోజు (గురు పౌర్ణమి)న బండ్ల గణేశ్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి బావోధ్వేగంతో కూడిన భారీ ట్వీట్ చేశాడు. వాస్తవానికి ఇండస్ట్రీలో గురూజీగా పేరున్నది దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు. అయితే పూనమ్ కౌర్ ఇన్ డైరెక్ట్‌గా టార్గెట్ చేసింది త్రివిక్రమ్‌నే అయినా.. అంతా పవన్ కల్యాణ్‌ను అనుకుంటూ.. ఆమె ట్వీట్స్ ను బాగా వైరల్ చేస్తుంటారు.
‘మీ అందరినీ కోరేది ఒకటే.. టామ్, డిక్ అండ్ హారీ అని ప్రతి ఒక్కరినీ గురువు అని పిలవకండి’ అని అర్థం వచ్చేట్టుగా.. ‘దారి చూపించేవాడు గురువు అవుతారు తప్పితే.. స్టేజ్ మీద నీతులు చెప్పి, జీవితాలతో ఆడుకునే వారు గురువు కాదని’ పెద్ద పెద్ద పదాలే వాడింది. ఈ ట్వీట్ పెద్దగా జనాలకు ఎక్కలేదు. ఇందులోనూ పూనమ్.. గురూజీనే టార్గెట్ చేసిందనేది బాగా పరిశీలిస్తేనే అర్థమవుతోంది.
అందుకే ఆమె పోస్ట్ చేసిన ఇన్ని రోజులకు ఆమె ట్వీట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్‌తోనే మొదలు కాదు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ పైనా ఇలాంటి కామెంట్లే చేసింది పూనమ్. ఇంత లోతుగా పోస్ట్ పెట్టడం వెనుక ఉద్దేశ్యం ఏమై ఉంటుందని చర్చ నడుస్తోంది. ఇబ్బంది ఉంటే మాట్లాడుకోవాల్సింది పోయి ఇలా ట్వీట్లు పెట్టి సాధించేది ఏముంది. ట్రోల్ కావడం తప్ప.