
ప్రముఖ నటులు , దర్శక నిర్మాత , రచయిత పోసాని కృష్ణమురళి కి కరోనా సోకింది దాంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఎందుకంటే పోసానికి కరోనా రావడం ఇది మూడోసారి. గతంలో రెండుసార్లు కరోనా సోకింది. ఇక ఇప్పుడేమో మూడోసారి మళ్ళీ కరోనా సోకడంతో అప్రమత్తమైన కుటుంబం హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇటీవలే ఓ సినిమా షూటింగ్ కోసం పూణే వెళ్ళాడు పోసాని. అక్కడ షూటింగ్ ముగించుకొని హైదరాబాద్ కు చేరుకోగానే కోవిడ్ లక్షణాలతో బాధపడుతుంటే ఎందుకైనా మంచిదని టెస్ట్ చేయించగా కోవిడ్ అని తేలింది. దాంతో ఆసుపత్రిలో జాయిన్ చేసారు. తెలుగు సినిమా రంగంలో పలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు పోసాని. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టీవీ అభివుద్ది సంస్థ ఛైర్మన్ గా పదవి నిర్వహిస్తున్నాడు.






