
డార్లింగ్ ప్రభాస్ పెళ్లి చేసుకుంటే ఘోర ప్రమాదం జరుగనుందని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్యులు వేణు స్వామి. ప్రభాస్ కు పెళ్లి అచ్చిరాదని, ఒకవేళ పెళ్లి చేసుకుంటే మాత్రం హీరో ఉదయ్ కిరణ్ కు పట్టిన గతి పట్టడం ఖాయమని కుండబద్దలు కొట్టారు. దాంతో ఈ వార్త ప్రభాస్ అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తోంది.
గతంలో కూడా ప్రభాస్ పెళ్లి గురించి చాలా చెప్పాడు ఈ జ్యోతిష్యుడు. ప్రభాస్ కు పెళ్లి యోగం లేదని, ఒకవేళ పెళ్లి చేసుకున్నా కాపురం సజావుగా సాగదని , విడాకులు అవ్వడం ఖాయమని చెప్పారు. ఇక ఇప్పుడేమో ఏకంగా ప్రభాస్ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. దాంతో ఇన్నాళ్లు ప్రభాస్ కు పెళ్లి కావడం లేదని బాధపడుతున్న అభిమానులు ఇప్పుడేమో పెళ్లి కాకపోయినా ఫరవాలేదు బ్రతికుంటే చాలు అని అనుకుంటున్నారు.
గతంలో ఈ జ్యోతిష్యుడు చెప్పిన కొన్ని విషయాలు నిజమయ్యాయి. దాంతో ఈ స్వామి వైరల్ అయ్యాడు. దాంతో వరుసగా పలువురు సెలబ్రిటీల జాతకాలు చెబుతూ మరింత ఫేమస్ అవుతున్నారు. నాగచైతన్య , సమంత విషయంలో చెప్పిన విషయం నిజం అయ్యేసరికి వేణు స్వామికి క్రేజ్ ఏర్పడింది.