
డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న లుక్ రానే వచ్చింది. ఇంతకీ డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న లుక్ ఏంటో తెలుసా ……. ఆదిపురుష్ చిత్రంలోని ప్రభాస్ లుక్. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది 2023 లో జనవరి 12 న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నాడు. అయితే సినిమా ఎప్పుడో ప్రారంభం అయినప్పటికీ ప్రభాస్ లుక్ ని మాత్రం రివీల్ చేయలేదు దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ దర్శకుడు ఓం రౌత్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. చాలాకాలంగా ప్రభాస్ లుక్ కోసం ఎదురు చూసారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగా డిమాండ్ చేసినా ……. సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించినా వాళ్ళు మాత్రం స్పందించలేదు.
కట్ చేస్తే ఈరోజు ప్రభాస్ లుక్ విడుదల చేసారు. ఈ లుక్ కు అద్భుత స్పందన వస్తోంది. ఆకాశానికి విల్లు ఎక్కుపెట్టిన ప్రభాస్ రాముడి లుక్ లో బాగున్నాడు. దాంతో ప్రభాస్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా సీతగా కృతి సనన్ నటిస్తోంది. ఇక రావణాసురుడుగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. అక్టోబర్ 2 న అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ విడుదల చేయబోతున్నారు.