ఆదిపురుష్ చిత్రంలో శ్రీరాముడు గా నటించడానికి భయపడ్డానని అన్నాడు డార్లింగ్ ప్రభాస్. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్ . తెలుగు , తమిళ, హిందీ, మలయాళ , కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న చిత్రం ఆదిపురుష్. ఓం రౌత్ ఈ చిత్రాన్ని ప్రభాస్ తోనే రూపొందించాలని పట్టుదలతో ప్రభాస్ కు ఈ కథ చెప్పాడట. అయితే కథ విన్నాక చేయాలా ? వద్దా ? అని భయపడ్డాడట. ఇంతకీ ప్రభాస్ ఎందుకు భయపడ్డాడో తెలుసా…….
శ్రీరాముడు ఉత్తమమైన పురుషుడు. ఆయన అనుసరణీయమైన నియమాలను ఆచరించి చూపించారు. అందుకే రాముడు దేవుడయ్యారు. కానీ ఆయన చూపించిన దారిలో మనం నడవలేకపోతున్నాం అందుకే మనం మనుషులమయ్యాం. ఇక ఈ పాత్ర నేను పోషించి మెప్పించగలనా ? అని మూడు రోజుల పాటు తీవ్రంగా ఆలోచించాను. చివరకు మూడు రోజుల తర్వాత ఓం రౌత్ కు ఫోన్ చేసి క్లారిటీ తీసుకున్న తర్వాత మాత్రమే అంగీకరించానని స్పష్టం చేశాడు డార్లింగ్ ప్రభాస్.
నిన్న అయోధ్యలో భారీ ఎత్తున ఆదిపురుష్ టీజర్ విడుదల అయ్యింది. ఈ చిత్ర టీమ్ అయోధ్యను , అలాగే రాముల వారిని దర్శించుకుంది. టీజర్ స్పందన బాగానే ఉంది. కానీ అదే సమయంలో కొన్ని విమర్శలు కూడా వినబడుతున్నాయి. 2023 జనవరి 12 న ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కానుంది.