యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన చిత్రం ” ఆదిపురుష్ ”. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ని ఈరోజు సాయంత్రం 7 గంటల 11 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం జరిగేది ఎక్కడో తెలుసా …… శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో. అవును అయోధ్యలో భారీ ఎత్తున ఆదిపురుష్ టీజర్ ని విడుదల చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లను చేసింది చిత్ర బృందం.
ఇక ఆదిపురుష్ చిత్రాన్ని వచ్చే ఏడాది 2023 జనవరి 12 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ప్రభాస్ శ్రీరాముడిగా నటించగా సైఫ్ అలీఖాన్ రావణాసురుడుగా నటించారు. ఇక సీతగా కృతి సనన్ నటించింది. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.
ఇన్నాళ్లకు ఆదిపురుష్ అప్ డేట్ లభించడంతో సంతోషంగా ఉన్నారు డార్లింగ్ ఫ్యాన్స్. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ అనూహ్యంగా మారిపోయిన విషయం తెలిసిందే. అయితే బాహుబలి తర్వాత వచ్చిన చిత్రాలు ఘోర పరాజయం పొందాయి. దాంతో అందరి ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. మరి ఏమౌతుందో …… ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియాలంటే 2023 జనవరి 12 వరకు ఎదురు చూడాల్సిందే.